ఘనంగా బాలల హక్కుల వారోత్సవాల ముగింపు వేడుకలు

కలం, కరీంనగర్‌ : కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం (Childrens Rights Week Celebrations) ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ వేడుకల్లో వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పలు రకాల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

వీటిలో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటిన విజేతలను అధికారులు, అతిథులు అభినందించారు. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వారి భద్రత, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

బాలలపై ఎలాంటి వేధింపులు, వివక్ష చోటుచేసుకోకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బాలల హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, చిన్నారులను ప్రోత్సహించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ ధనలక్ష్మి, కమిటీ సభ్యులు కళింగ శేఖర్, విజయ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామారావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి పర్వీన్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది సంపత్, సీసీఐ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>