వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

కలం, నేరడిగొండ: నేరడిగొండ (Neradigonda) మండల కేంద్రంలో నిర్మల్‌కు చెందిన స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని (Free Mega Medical Camp) బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన ఇలాంటి శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ శిబిరంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు రోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోగా, వారికి వైద్యులు అవసరమైన సలహాలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read : ఐఐటీ ఖరగ్‌పూర్‌కు గూగుల్ భారీ విరాళం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>