బాలసదనం పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ రూరల్: బాలసదనం (Balasadanam) లో వసతి పొందుతున్న పిల్లలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. జాతీయ బాలల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గల బాలసదనాన్ని సందర్శించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన బాలసదనంలోని వివిధ విభాగాలను పరిశీలించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలందరికీ అన్ని వసతులు కల్పించాలన్నారు. చిన్నారులతో నేరుగా మాట్లాడి వారి వివరాలు, బాలసదనంలో సౌకర్యాలు, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని, వారి జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆటలు ఆడాలని తెలిపారు. బాలసదనం అధికారులతో మాట్లాడుతూ.. చిన్నారులకు ఎటువంటి సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అందరూ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు.

విద్యార్థులను ఇతర రాష్ట్రాలకు విమానాల్లో సందర్శనకు తీసుకువెళ్లాలని సూచించారు. ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో వారికి సందేశాత్మకమైన, వారి మనోస్థైర్యం నింపేలా మంచి మంచి సినిమాలను ప్రదర్శించాలన్నారు. వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి వారిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. త్వరలోనే సొంత భవనంలోనికి బాలసదనాన్ని మారుస్తామని హామీ ఇచ్చారు. చిన్నారులతో కేక్ కట్ చేయించి, వారికి కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న, అధికారులు మురళి, వైష్ణవి, రాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>