కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్లో ముదిరాజ్ సంఘం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ (Telangana Mudiraj Mahasabha) ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ ప్రాధాన్యతను, మత్స్యకారుల ఐక్యత, సంఘటిత శక్తి ఆవశ్యకతను చాటిచెప్పారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు.

