ఐటీ మంత్రి శ్రీధర్ బాబు OSD పేరుతో భారీ మోసం!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరుతో ఓ కేటుగాడు (Fake OSD) భారీ మోసానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి రూ.50.87 లక్షలు వసూలు చేసిన కొలుగూరి రవికిరణ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మంత్రి శ్రీధర్ బాబు OSD అంటూ నిందితుడు కొలుగూరి రవికిరణ్ నకిలీ ఐడీ కార్డును తయారు చేసుకుని బాధితులను నమ్మించాడు. అంతేకాకుండా, అచ్చం ప్రభుత్వ వెబ్‌సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్ సృష్టించి నిరుద్యోగులకు ఎర వేశాడు. టీచర్, అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నలుగురు బాధితుల నుంచి దఫదఫాలుగా రూ.50.87 లక్షలు కాజేశాడు.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడు కొలుగూరి రవికిరణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>