అనధికార నిర్మాణంపై బల్దియా కొరడా!

కలం, హనుమకొండ: నగరంలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC ) అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హనుమకొండలోని న్యూశాయంపేట (New Shayampet) ప్రాంతంలో వివాదాస్పద భూమిలో నిర్మించిన ఏసీ రేకుల షెడ్డును శుక్రవారం తొలగించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఆదేశాల మేరకు టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ నస్రీన్ బాను ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు.

సదరు స్థలంలో అనుమతులు లేకుండా షెడ్ నిర్మించడంపై సంబంధిత వ్యక్తులకు గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో అధికారులు తొలగింపు చర్యలకు దిగినట్లు ఏసీపీ తెలిపారు. నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ చర్యల్లో టీపీఎస్ ఖురేషీ, డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>