కలం, స్పోర్ట్స్: తండ్రి పేరు.. తనకు వచ్చిన గుర్తింపు. కానీ ఆ పేరుతోనే కొనసాగడం ఆర్యవీర్ సెహ్వాగ్ (aaryavir sehwag)కు ఇష్టం లేదు. తన ఆటతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌తో పోలికలు రావడం సహజమేనని అంగీకరిస్తూనే.. తాను మాత్రం రెండో సెహ్వాగ్‌గా కాకుండా, మొదటి ఆర్యవీర్గా గుర్తింపు పొందాలనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఇటీవల ముగిసిన అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ తన సత్తా చాటాడు. ఐదు మ్యాచ్‌ల్లో 361 పరుగులు చేశాడు. 90.25 సగటుతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు.
పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లోనూ ఆర్యవీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ 61 బంతుల్లో 58 పరుగులు చేశాడు. భారత్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. తండ్రి సాధించిన విజయాలతో పోలికలు రావడం తప్పదని ఆర్యవీర్ భావిస్తున్నాడు. అయితే తన ప్రయాణం మాత్రం ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే తండ్రి పేరును కాకుండా, తన ఆటనే తన గుర్తింపుగా మార్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

