కలం, జడ్చర్ల: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బాదేపల్లి(Badepally) గ్రంథాలయంలో గత వారం రోజులుగా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారి లక్ష్మి తెలిపారు. శుక్రవారం గ్రంథాలయంలో పుస్తక ప్రాశస్త్యం అనే అంశంపై కవి సమ్మేళనం నిర్వహించామని, ఈ సందర్భంగా కవులందరిని సన్మానించడం జరిగిందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు పాటల పోటీలు, ఉపన్యాస పోటీలు రెండు పాఠశాలలకు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు పెద్దలతో బహుమతులు ఇప్పించామని తెలిపారు.
అదేవిధంగా పాఠకుల దినోత్సవం సందర్భంగా ఉత్తమ పాఠకులను ముగ్గురిని ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాద్మీ రవిశంకర్, కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉమ్మెత్తల మహేశ్వర్, రాఘవేందర్, చంద్రశేఖర్, లక్ష్మయ్య యాదవ్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

