కలం, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నూతనంగా ఎంపికైన లబ్ధిదారులు పండగ ప్రభాకర్, రజిత దంపతుల ఇంటి నిర్మాణానికి కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నరసన్న పటేల్(Narasanna Patel) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యతతో ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి విడతలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ప్రాజెక్టు చీతాలో మరో మైలురాయి.. 4 కూనలకు జన్మనిచ్చిన చిరుత!
Follow Us On: X(Twitter)

