కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో ఓ సర్పంచ్ (Nizamabad Sarpanch) కటకటాల్లోకి వెళ్ళాడు. పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం సర్పంచ్ దస్తగిరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. జల్లాపల్లి ఫారం సర్పంచ్ అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
సర్పంచ్ పై పోలీసులు పోక్సో కేసు (POCSO Case) నమోదు చేయడంతో సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించాడు. సర్పంచ్ తీసుకొచ్చిన ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్ కొట్టివేశారని, దీంతో సర్పంచ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.

