కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం నగర నూతన మేయర్ ముక్కా శ్రావణి ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, మాజీ టీడీపీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు (Mukka Mutyala Naidu) కన్నుమూశారు.
తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముత్యాల నాయుడు మృతి చెందినట్లు సమాచారం.
ఈ నెల 23వ తేదీన విశాఖ మేయర్గా ముక్కా శ్రావణి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమార్తె మేయర్గా బాధ్యతలు చేపట్టే ఆ మధుర ఘట్టాన్ని చూడకుండానే తండ్రి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ముత్యాల నాయుడు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలుపుతున్నారు.

