మాజీ ఎమ్మెల్యేకు భారీ షాక్.. ఇళ్లలో ఈడీ మెరుపు దాడులు!

కలం, ఖానాపూర్: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు రేఖా నాయక్‌ (Rekha Naik)కు చెందిన నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టడంతో ఖానాపూర్‌లో ఒక్కసారిగా రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రూ.40.96 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం అక్రమాల వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంపై ఈడీ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామంలోని ఏఆర్ఎస్ రైస్‌మిల్లులో 2022-23, 2023-24, 2024-25 రబీ సీజన్లకు సంబంధించి ప్రభుత్వ ధాన్యం 9,639.962 మెట్రిక్ టన్నుల మేర కొరత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ధాన్యం విలువ రూ.40,96,96,834గా అంచనా వేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సుధాకర్ ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 19న క్రైమ్ నంబర్ 165/2026తో బీఎన్‌ఎస్‌లోని 316(2), 316(5), 318(4) సెక్షన్లతో పాటు నిత్యావసర సరుకుల చట్టంలోని సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ అంశాలపై దృష్టి సారించిన ఈడీ అధికారులు రేఖా నాయక్ నివాసాలకు చేరుకుని సోదాలు చేపట్టారు.

తనిఖీల సమయంలో ఆమె ఇంట్లోనే ఉన్నట్లు తెలిసింది. ఈడీ అధికారులు అక్కడికి చేరుకున్న విషయం తెలుసుకున్న ఆమె అనుచరులు పెద్ద సంఖ్యలో నివాసం వద్దకు చేరుకున్నారు. మరోవైపు రేఖా నాయక్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈడీ సోదాలు, తదుపరి పరిణామాలపై ఖానాపూర్‌తో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Also Read : ఇన్సూరెన్స్ లేకపోతే రూ.10 వేలు ఫైన్.. NHAI క్లారిటీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>