కలం, వెబ్ డెస్క్: అక్వాన్ తుఫాను (Cyclone Akvan) తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తుపాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచినట్లు వెల్లడించింది. తుఫాను తీరం మొత్తం దాటేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
అక్వాన్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలులు, వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను (Cyclone Akvan) ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Also Read : పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కత్తితో వ్యక్తి హంగామా!
Follow Us On : WhatsApp

