పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. మనస్థాపంతో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య!

కలం, ఖమ్మం బ్యూరో: ​ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ నర్సింగ్ విద్యార్థిని పురుగు మందు తాగి ఆత్మహత్య (Nursing Student Suicide) కు పాల్పడింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలం చెరువు సింగారం గ్రామంలో చోటుచేసుకుంది.

​వివరాల్లోకి వెళితే.. చెరువు సింగారం గ్రామానికి చెందిన చెరప కవిత (20) నర్సింగ్ చదువుతోంది. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్న కవిత, ఇటీవల పెళ్లి ప్రస్తావన తీసుకురాగా సదరు యువకుడు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కవిత గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. ​

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కవిత మృతి చెందింది. తమ కుమార్తె మృతికి ఆ యువకుడే కారణమంటూ కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>