కొండగట్టులో అద్భుత ఘట్టం.. 60 ఏళ్ల తరువాత అంజన్న నిజరూప దర్శనం

కలం, వెబ్​ డెస్క్​: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొండగట్టు ఒకటి. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేట గ్రామ సమీపంలో ఉన్న అంజన్న ఆలయానికి (Kondagattu Anjaneya Swamy Temple) తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలు భక్తులు తరలివస్తుంటారు.

అయితే కొండగట్టులో (Kondagattu) 60 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుత ఘట్టం నేడు (శుక్రవారం) ఆవిష్కృతం అవుతుంది. భక్తులకు ఆంజనేయస్వామి వారి మూలవిరాట్​ నిజరూప దర్శనం కలగనుంది. ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో, వైభవంగా నిర్వహిస్తున్న చందనోత్సవం నేటితో ముగియనున్నాయి.

అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, తొలి ఆరాధన చేసిన తర్వాత భక్తులకు అంజన్న నిజరూప దర్శనానికి అనుమతిస్తారు. ఈ అద్భుత దర్శనం 40 రోజుల పాటు కొనసాగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>