ముదిరాజ్ జెండా పండుగ పోస్టర్ల విడుదల

కలం, లక్ష్మణచాంద: ఈనెల 21న నిర్వహించనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, తెలంగాణ ముదిరాజ్ మహాసభ (Mudiraj Mahasabha) ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిర్మల్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆదేశాల మేరకు గురువారం లక్ష్మణచాంద మండల కేంద్రంలో జెండా పండుగ పోస్టర్లను విడుదల చేశారు.

ప్రతి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జెండా పండుగ నిర్వహించి, సంఘం భవనం వద్ద జెండా ఎగురవేయాలన్నారు. ముదిరాజ్‌ల ఐక్యత, సంఘటిత శక్తిని చాటేలా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణచాంద మండలంతో పాటు మల్లాపూర్, పీచర గ్రామాల ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>