భోజనం నాణ్యత లేకపోతే చర్యలు తీసుకోవాలి: బీఎస్పీ

కలం, నిర్మల్: ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని నిర్మల్ జిల్లా బీఎస్పీ (Nirmal BSP) పార్టీ నేతలు కలెక్టర్ భవేష్ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ మాట్లాడుతూ.. కొన్ని హాస్టళ్లలో పురుగుల అన్నం, కుళ్లిన కూరగాయలు, కలుషిత తాగునీరు అందుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆహార నాణ్యతను పరీక్షించాలని, నిర్లక్ష్యం వహించే వార్డెన్లు, కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>