బీఆర్ఎస్ హయాంలోనే మునుగోడు అభివృద్ధి: జగదీశ్ రెడ్డి

కలం, మునుగోడు: చేనేత రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సరైన ప్రోత్సాహం, అభివృద్ధి లభించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులను పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy)ఆరోపించారు. గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆలిండియా హ్యాండ్లూమ్ డైరెక్టర్ గా కర్నాటి వజ్రమ్మ, వెంకటేశం ఎన్నికైన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల సమస్యలను గుర్తించి, వారి సంక్షేమానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కృషి చేయడంతోపాటు వివిధ వృత్తి కులాల కార్మికులకు అప్పుడే కెసిఆర్ ప్రభుత్వంనెలకు రూ.2,000 పింఛను పెంపు చేపట్టిందన్నారు.చేనేత కార్మికుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యాన్ని నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం దారుణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ కొరత ఏర్పడిందని అన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. ప్రజలకుఇచ్చిన హామీల లో ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ బీ ఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి క్యామ మల్లేష్, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి, బీఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు పాల్వాయి స్రవంతి, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ, మాజీ జెడ్పిటిసి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీపీ అవ్వారు గీత శ్రీనివాస్, గుర్రం వెంకటరెడ్డి, కుండే వెంకటేష్, మద్ది ప్రవీణ్ రెడ్డి, పంకెర్ల ప్రభాకర్, జగన్మోహన్, మెండు మోహన్ రెడ్డి, బండారి చంద్రయ్య, తోటకూరి శంకర్,గొరిగే సత్తయ్య, పున్న కిషోర్, చిలుకూరి అంజయ్యపలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>