ఏజెన్సీ ముసాయిదా పత్రాలను దగ్ధం చేసిన ఆసుపత్రి కార్మికులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ విభాగాల కాంట్రాక్టు కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కనికరం లేదా? అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) రాష్ట్ర కార్యదర్శి సురేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషెంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులకు కనీస వేతనం 26 వేలకు పెంచాలన్నారు. కాల పరిమిత ముగిసిన ఏజెన్సీలను రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై జరుగుతున్న ఆసుపత్రి కార్మికుల ఆందోళన 8వ రోజుకు చేరింది.

తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నేతృత్వంలో గురువారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కార్మికులు నిరసన ప్రదర్శించారు. కాల పరిమిత ముగిసిన ఏజెన్సీల ప్రభుత్వ టెండర్ నోటిఫికేషన్ నమూన ముసాయిదాలను శ్రమ దోపిడికి గురిచేసే ఏజెన్సీల దోపిడి భరించలేమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022లో నుంచి అమలులో ఉన్న టెండర్ నోటిఫికేషన్ ముసాయిదా నమూన కాపీలను నెత్తిన మోస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి, ఆసుపత్రి ప్రాంగణంలో పత్రాలను దహనం చేశారు.

ఈసందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య, సెక్యూరిటీ,పేషంట్ కేర్, సూపర్వైజర్ కాంట్రాక్టు కార్మికులు చాలీచాలని జీతాలతో జీవితాలు అంధకారం అవుతున్నాయని అన్నారు. లేబర్ కాంట్రాక్టు చట్టం ప్రకారం కార్మికులకు కనీస వేతనాలు ఇతర సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు. ప్రభుత్వం కాలయాపన లేకుండా తక్షణమే కనీస వేతనం రూ.26 వేలకు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఒకటవ తేదీని వేతనాలు చెల్లించాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలని.. కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ నేతలు కార్మికులు రంగన్న, నరసింహ, బి.చెన్నయ్య, రాఘవేందర్, నరేష్, యాదయ్య,లోకేష్, అంజలయ్య, నైసన్, యాదగిరి, వెంకటన్న, రామకృష్ణ, నరేష్, శ్రీనివాసులు, గోపాల్, గంగాధర్, బాలరాజ్, గంగపురి, శ్రీశైలం, చిన్నయ్య, మున్నా, నైసన్, శ్రీశైలం, శంకర్, బాలరాజ్, రాఘవేందర్, శ్రీను, చంద్రకళ, నాగమ్మ, సత్యమ్మ, లక్ష్మమ్మ, నాగమణి, సత్తెమ్మ, లక్ష్మి, ఇందిరా, జ్యోతి, మంజుల, అంజలమ్మ, జ్యోతి, నిర్మల, మమత, సునీత, మంజుల, చిట్టెమ్మ, కవిత, అరుణ తిరుపతమ్మ జంగమ్మ మీనా, గాయత్రి, పద్మ,యాదమ్మ, శిరీష, సరోజ, చెన్నమ్మ, వెంకటమ్మ, పద్మమ్మ, లక్ష్మి, సాయమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>