కలం, వెబ్ డెస్క్: కార్తీక మాసోత్సవాల్లో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం(Yadadri Temple)లో కోటి పుష్పార్చన కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. స్వామివారికి కోటి నామాలు, కోటి పుష్పాలతో అర్చన నిర్వహించే ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఆలయ ఈవో భవానీ శంకర్ వేద పండితులు, అర్చక స్వాముల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛారణలు, నామావళి పారాయణాల మధ్య పుష్పార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నేటి నుంచి నిరంతరాయంగా శాస్త్రోక్త విధానంలో స్వామివారి నామాలను పారాయణం చేస్తూ, వివిధ రకాల పుష్పాలతో అర్చనలు నిర్వహించనున్నారు. భక్తిశ్రద్ధలతో సాగే ఈ మహత్తర కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగి సంపూర్ణం కానుంది. కోటి నామాలు, కోటి పుష్పాలతో స్వామివారిని అర్చించడం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
Follow Us On: Sharechat

