కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఐదు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిరికొండ మండలం పెద్ద వాల్గోట్, డిచ్పల్లి మండలం యానంపల్లి, జక్రాన్పల్లి మండలం పడకల్, నవీపేట్ మండలం జన్నేపల్లి, భీంగల్ మండలం రహత్నగర్లలో కొత్త సొసైటీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో 89 సంఘాలు ఉండగా, కొత్త ఐదు సంఘాలతో కలిపి మొత్తం సంఖ్య 94కు చేరనుంది.

