ఓటరు జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో (Voter List Enrollment) పేర్లు లేని ఏఎస్డీడీ ఓటర్లకు తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుదవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎస్డీడీ ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియ నవంబర్ 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, డిసెంబర్ 10లోగా ఫారాల పరిశీలన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించగా, తుది ఓటరు జాబితాను డిసెంబర్ 22న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని, పేరు లేని వారు అవసరమైన పత్రాలతో సంబంధిత బూత్ స్థాయి అధికారిని సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. సందేహాల నివృత్తికి ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>