పట్టభద్రుల ఓటరు జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలి: కలెక్టర్

కలం, వనపర్తి: పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ఓటరు జాబితా రూపకల్పన ప్రక్రియను పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిని వివరించారు. జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదుకు 29,232 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 27,961 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. ఫారం-18 ద్వారా వచ్చిన దరఖాస్తులను సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.

అర్హులైన పట్టభద్రుల పేర్లు జాబితాలో చేరేలా, అనర్హులు, డబుల్ ఓట్లు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల కానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, తదుపరి ప్రక్రియను సక్రమంగా నిర్వహించి డిసెంబర్ 30న తుది జాబితా ప్రచురించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, డీఆర్వో రామ్‌రెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>