ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 గోడప్రతుల ఆవిష్కరణ

కలం, నిర్మల్ : ఖేలో ఇండియా (Khelo India) యూత్ గేమ్స్ -2026 ప్రచార గోడప్రతులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై జిల్లాలో విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, వెంకట మాధవ రావు, డీఆర్ఓ రాథోడ్ రమేష్, ఆర్డీఓ దేవీదాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>