సిద్దిపేటలో సీఎం సభకు ఏర్పాట్లు పూర్తి

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన, భారీ బహిరంగ సభ నేపథ్యంలో సిద్దిపేట (Siddipet) బైపాస్ రోడ్డులోని నాగదేవత ఆలయం వద్ద సభా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదిక, ఇతర మౌలిక సదుపాయాలను మంత్రులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మధ్యాహ్నం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, సాయంత్రం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ వేర్వేరుగా సభా ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. సభా వేదిక, ఇతర సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభలో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో ప్రజల కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై ముఖ్యమంత్రి సభా వేదిక నుంచి ప్రసంగించనున్నారు. పోలీస్, ట్రాఫిక్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సభను విజయవంతం చేయాలని మంత్రులు సూచించారు.

సభకు వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్, బారికేడింగ్, లైటింగ్, భద్రతా ఏర్పాట్లు, జన సమీకరణ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే వాహనాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్ సమస్యలు రాకుండా తగిన స్థలాలను కేటాయించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>