బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్

కలం, వెబ్ డెస్క్ : కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏపీ 4,490 టీఎంసీల నీటిని వాడుకుంటే, ఆనాటి పాలకులు ఏపీకి అనుకూలంగా సంతకాలు చేసి తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

కృష్ణా బేసిన్‌లో పదేళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని బీఆర్ఎస్, పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ మార్చి, 99 శాతం పనులు పూర్తయ్యాయని అబద్ధాలు చెప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల్లో 71 శాతం వాటా కోసం గట్టిగా పోరాడుతోందని, ఇప్పటివరకు సగటున 242 టీఎంసీల నీటిని వినియోగించుకున్నామని ఉత్తమ్ వివరించారు. 21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ (Nagarjuna Sagar) భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఎన్నికల సమయంలో జగన్ తో కుమ్మక్కై సాగర్‌పై వివాదాలు సృష్టించిన బీఆర్ఎస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Also Read : ‘బిడ్డా రేవంత్‌.. ఖబర్దార్’.. రాజగోపాల్ రెడ్డి మాస్ వార్నింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>