కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తమ డిమాండ్లు నెరవేర్చాలని మహబూబ్ నగర్ (Mahabubnagar) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆసుపత్రి కార్మికుల ఆందోళనలో భాగంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో బుధవారం ఏడవ రోజు నగర ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు (Hospital Contract Workers).. ఆసుపత్రి నుంచి ఉరి తాళ్లకు వేలాడుతూ రాయచూర్ ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు.
ఆకలి కేకలతో అలమటిస్తూ గత ఏడు రోజులుగా కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని ప్రభుత్వ ఆసుపత్రుల పారిశుధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళనలు చేస్తున్నామని అన్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సబబు కాదని చెప్పారు.
తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ మాట్లాడుతూ.. జీతాలు పెంచకపోతే తీవ్రస్థాయిలో సమ్మె తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వాసుపత్రులలో పనిచేస్తున్న కాంటాక్ట్ పారిశుద్ధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సూపర్వైజర్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరారు. కాల పరిమితి ముగిసిన ప్రైవేటు ఏజెన్సీలను రద్దు చేయాలని.. పండగ సెలవులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం ఒకటో తారీఖు నాడే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించాలని.. ఉద్యోగ సామాజిక భద్రత కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులు రంగన్న, జే.నరసింహ బి .చెన్నయ్య, బాలరాజ్, బాలకోటి బుచ్చన్న, యాదయ్య, అంజలయ్య, భీమన్న, మన్యం, యాదగిరి, నైసన్, శ్రీనివాసులు, నరేష్, గోపాల్ శ్రీను, నరేష్, వీరాంజనేయులు, వెంకటన్న, రామస్వామి, లోకేష్ రామకృష్ణ, చిన్నయ్య, రాఘవేందర్, యుగంధర్ రెడ్డి, శ్రీశైలం, శంకర్, బాలరాజు, సత్యమ్మ, నాగమ్మ, లక్ష్మమ్మ, ఇందిరా, జ్యోతి, నిరీక్షణ, లక్ష్మి, అరుణ సరోజ మంజుల జమున తిరుపతమ్మ సునీత, అంజమ్మ జంగమ్మ కవిత, మీనా, గాయత్రి, పద్మ, భాగ్యలక్ష్మి, యాదమ్మ, చిట్టెమ్మ, సత్యమ్మ, శిరీష, మంజుల, చెంచు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

