పెద్ద‌ప‌ల్లికి నాగ‌ చైత‌న్య సీక్రెట్ టూర్‌

క‌లం, సినిమా: యువ సామ్రాట్ నాగ చైత‌న్య (Naga Chaitanya) కొత్త సినిమా వృష‌క‌ర్మ మరికొద్ది రోజుల్లో విడుద‌ల‌వుతున్న తరుణంలో చైతూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారారు. తాజాగా చైతన్య పెద్ద‌పల్లి జిల్లాకు వచ్చి వెళ్లారన్న వార్తలు నెట్టింట‌ వైరల్‌గా మారాయి. పెద్ద‌ప‌ల్లి జిల్లాలో రామ‌గిరి ఖిల్లా (Ramagiri Khilla) చాలా ఫేమ‌స్‌. దీనికి గొప్ప‌ చారిత్ర‌క నేప‌థ్యం కూడా ఉంది. ఏళ్ల త‌ర‌బ‌డి మంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశంగా గుర్తింపు పొందింది. చైతూ మంగ‌ళ‌వారం ఎలాంటి హ‌డావుడి లేకుండా సీక్రెట్‌గా రామ‌గిరి ఖిల్లాను సంద‌ర్శించి వెళ్లిన‌ట్లు వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి.

రామ‌గిరి ఖిలా పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గిరి మండ‌లంలోని బేగంపేట నుంచి ర‌త్నాపూర్ వ‌ర‌కు విస్త‌రించి ఉంది. చైతూ బేగంపేట గ్రామం నుంచి ట్రెక్కింగ్ చేస్తూ ఖిలా మీదికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. నాగ‌చైత‌న్య (Naga Chaitanya) వ‌చ్చిన విష‌యం స్థానికుల‌కు కూడా తెలియ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. చైత‌న్య రామ‌గిరి ఖిలాపై దిగిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇంత‌కీ చైతూ అక్క‌డికి ఎందుకు వెళ్లిన‌ట్లు? ఎవ‌రెవ‌రితె వెళ్లారు? అనే విషయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఆయ‌న లేటెస్ట్ మూవీ వృష‌క‌ర్మ డిసెంబ‌ర్ మొద‌టి వారంలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా వెళ్లారా? లేక ఏదైనా షూటింగ్ కోసం లొకేష‌న్ సెర్చింగ్‌లో భాగంగా వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read : మాగ్నస్ కార్ల్‌సన్ షాకింగ్ నిర్ణయం.. గేమ్‌కు డుమ్మా!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>