హుజురాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

కలం, జగిత్యాల: రానున్న ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) సూచించారు. బుధవారం కమలాపూర్ మండలంలో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి పెన్షన్లు అందజేశారని అన్నారు. కేవలం హుజురాబాద్ నియోజకవర్గంలో 44,373 మందికి పెన్షన్లు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు పెన్షన్లను రూ. 4,000కు, వికలాంగుల పెన్షన్లను రూ. 6,000కు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.

పెన్షన్ల పెంపుతో పాటు హుజురాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రూ. 1,000 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. పేదల సంక్షేమం, రైతుల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు ప్రజల పక్షాన తన పోరాటం కొనసాగిస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>