కలం, వెబ్ డెస్క్ : తమకు రావాల్సిన స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వద్ద భారీ నిరసన ర్యాలీ (LB Stadium Protest) చేపట్టారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు సకాలంలో అందక తాము ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయని, వెంటనే నిధులు విడుదల చేసి తమ చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ నినాదాలు చేశారు.

