కలం, ఆదిలాబాద్: జిల్లా గనులు, భూగర్భ శాఖ సహాయ సంచాలకులుగా ఏం తిరుపతిరావు(Tirupathi Rao) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ నూతన సహాయ సంచాలకులకు శుభాకాంక్షలు తెలిపారు. గనులు, భూగర్భ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయల్టీ ఇన్‌స్పెక్టర్ రమేష్ పవర్, తదితరులు పాల్గొన్నారు.

