జర భద్రం.. తెలంగాణలో మరింత పెరగనున్న చలి తీవ్రత!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత (Telangana Cold Wave) క్రమంగా పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

సంగారెడ్డి తర్వాత రంగారెడ్డి జిల్లాలో 11.3 డిగ్రీలు, కామారెడ్డిలో 11.7 డిగ్రీలు, వికారాబాద్‌లో 11.8 డిగ్రీలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వీటితో పాటు రాష్ట్రంలోని మరో 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతుండటంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. రాత్రివేళల్లోనే కాకుండా తెల్లవారుజామున కూడా పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న శుక్రవారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>