కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి (Adilabad Airport )ఆటంకంగా ఉన్న 765 కేవీ విద్యుత్ ప్రసార లైన్ మళ్లింపునకు పవర్‌గ్రిడ్ సంస్థ, జిల్లా కలెక్టర్ మధ్య ఎంఓయూ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పవర్‌గ్రిడ్ ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో కలిసి లైన్ మళ్లింపు ప్రక్రియపై వివరించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ ఒప్పందం కీలకంగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, పవర్‌గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ పిఆర్ఎస్ యాదవ్, డీజీఎం వెంకన్న, చీఫ్ ఇంజినీర్ పరిమళ, సీనియర్ డీజీఎం బిక్షపతి, సిఈ. చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

