భద్రాద్రి జిల్లాలో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడులు

కలం, ఖమ్మం బ్యూరో: ​భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా దుమ్ముగూడెం మండలంలోని సుజ్ఞానపురం, చింతగుప్ప, జిన్నెలగూడెం గ్రామాల్లో మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది విస్తృతంగా దాడులు (Liquor Brewing Units ) నిర్వహించారు. గ్రామ శివార్లలో కొందరు అక్రమంగా నాటుసారా తయారు చేస్తూ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ​

ఈ దాడుల్లో నాటుసారా తయారీకి వినియోగిస్తున్న సుమారు 1,200 లీటర్ల పంచదార పానకంతో పాటు, 20 లీటర్ల తయారైన నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న తయారీదారులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

​ఈ తనిఖీల్లో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి ఎ. శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. శ్రీనివాస్, సీఐలు కిష్టయ్య, పి. రమాదేవి, ఎస్సైలు సీతా రామరాజు, ఎం. విజయభాస్కర్ తో పాటు ఇతర ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>