రేపు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటి (TOSS Results) ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్త్, ఇంటర్ పబ్లిక్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు ( నవంబర్ 18) ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. ఫలితాలు విడుదలైన వెంటనే తెలంగాణ ఓపెన్ స్కూల్ అధికారిక వెబ్‌సైట్ telanganaopenschool.org ద్వారా అభ్యర్థులు తమ మార్కులను వివరాలను చెక్ చేసుకోవచ్చు.

అక్టోబర్ 11 నుంచి 17వ తేదీ వరకు ఈ థియరీ పరీక్షలు జరిగాయి. అభ్యర్థులు తమ మార్కుల కోసం అధికారిక వెబ్ సైట్ లోని హోమ్ పేజీలోని ఫలితాల లింక్ పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నంబర్ లేదా అడ్మిషన్ నంబర్ ఎంటర్ చేస్తే డిజిటల్ మార్కుల మెమో డౌన్ లోడ్ అవుతుంది. విద్యార్థులు తమ మార్కుల జాబితాలో పేరు, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు, పాస్ స్టేటస్ వంటి వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>