మోదీ చాలా గట్టి మనిషి.. క్వాడ్ వేదికపై ట్రంప్ ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (Narendra Modi) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసలు కురిపించారు. మనీలాలో (Manila) జరిగిన నాలుగు దేశాల కూటమి (క్వాడ్‌) శిఖరాగ్ర సమావేశంలో (Quad Summit) మోదీని ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోదీ చాలా గట్టి మనిషి” అంటూ కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై ఇద్దరు అగ్రదేశాల నేతలు ఒకే వేదికను పంచుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మోదీ వ్యక్తిత్వం, నాయకత్వ పటిమను ప్రశంసించారు.

జపాన్ ప్రధాని సనాయే తకాయిచి కూడా ఎంతో గట్టి నాయకురాలని అభివర్ణించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, తాను కూడా ఏమాత్రం తీసిపోమని సరదాగా వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో సమావేశ మందిరంలో నవ్వులు విరిశాయి. అక్కడున్న నేతలు సైతం ఆయన మాటలను ఆస్వాదించారు. క్వాడ్ సమావేశం సందర్భంగా చోటుచేసుకున్న ఈ సరదా సంభాషణ ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోదీపై ట్రంప్ ప్రశంసలు చేయడం ఇరు దేశాల నాయకుల మధ్య సంబంధాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలు రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>