తెలంగాణ ఎవరో ఇచ్చిన భిక్ష కాదు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : సోనియా గాంధీ ఆత్మలో తెలంగాణ లేదు కాబట్టే ఆమె ఇటీవల విడుదల చేసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రస్తావన లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. నేడు తెలంగాణ భవన్‌లో మీడియాతో జరిగిన చిట్ చాట్ ‌లో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా లంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిన దయాభిక్ష కాదని, అది తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితమని కేటీఆర్ స్పష్టం చేశారు.

మరోవైపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించిన కేటీఆర్, ఆయనపై అంత ప్రేమే ఉంటే అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవం కోసం తిరగబడ్డ తెలంగాణ సమాజంలో నేటి కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు చీప్‌గా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి పూర్తిగా బాడీగార్డ్‌గా మారారని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిన్నపిల్లాడిలా ఉరుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన కేంద్ర మంత్రి అమిత్ షా కాళ్లకు మొక్కడం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమేనని వ్యాఖ్యానించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>