కలం, నిర్మల్: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని (Old Pension Scheme) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు (Government Employees) ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయడంతో ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రతపై ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు భవిష్యత్తుపై భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో రమేష్ రాథోడ్‌కు అందజేశారు.

