గ్లోబల్ సమ్మిట్‌ను వాయిదా వేయండి.. సీఎంకు బహిరంగ లేఖ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ (Global Summit)ను తక్షణమే వాయిదా వేయాలని 400 మందికి పైగా పౌర సమాజ నేతలు, మేధావులు, విద్యావేత్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 365 మండలాల్లో కరువు ఛాయలు అలుముకుని ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతుంటే, సమ్మిట్ పేరుతో 4 వేల మంది అతిథులకు ఫైవ్‌స్టార్ విలాసాలు కల్పించడం ఏంటని వారు ప్రశ్నించారు.

ఒకవైపు తీవ్రమైన నీటి ఎద్దడి కారణంగా రాష్ట్రంలోని అనేక పాఠశాలలు, హాస్టళ్లు మూతపడుతుంటే, మరోవైపు ఫ్యూచర్ సిటీలో వేడుకలు నిర్వహించడం సబబు కాదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కరువు సహాయక చర్యలను పక్కనపెట్టి, ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులను అతిథుల సేవలకు మళ్లించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాధనం, నీరు, విద్యుత్ వంటి విలువైన వనరులను ఇలాంటి ఆర్భాటాలకు కాకుండా పూర్తిగా కరువు నివారణ చర్యలకే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ బహిరంగ లేఖపై ప్రొఫెసర్ శాంతా సిన్హా, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి, ఇ.ఎ.ఎస్. శర్మ తదితర ప్రముఖులు సంతకాలు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>