ఇంటర్​ బోర్డు రద్దు.. ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

కలం, వెబ్​ డెస్క్​: రాష్ట్రంలో ఇంటర్​ బోర్డు రద్దుపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత (TRS Chief Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్​ బోర్డు రద్దు – తెలంగాణ విద్యపై ప్రభావం అనే అంశంపై సోమాజిగూడలో రౌండ్​ టేబుల్ సమావేశు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా సంస్కరణల పేరుతో పరిపాలనా మార్పులను విద్యా సంస్కరణలుగా చిత్రీకరించవద్దని ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు.

విద్యార్థుల సంఖ్య, డ్రాపౌట్ రేటులో తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నప్పటికీ.. నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం వెనుకబాడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1 నుంచి 10వ తరగతి వరకు డ్రాపౌట్స్​ లేకుండా చదువుతున్న రాష్ట్రాల జాబితాలో టాప్​ –5లో తెలంగాణ ఉందని కవిత వివరించారు. అయితే, నాణ్యమైన విద్యను అందించడంలో మాత్రం 28వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించాలని కవిత సూచనలు చేశారు.

తెలంగాణలో ఇంటర్ బోర్డును రద్దు చేయాలన్ని ప్రభుత్త నిర్ణయాన్ని తాము పూర్తిగా వ్యతిరేకించడం లేదని కవిత స్పష్టం చేశారు. కానీ, ఎవరి అభిప్రాయాలను తసుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలతో ఇంటర్ బోర్డును రద్దు చేయాలని చూస్తే ఊరుకోబోమని ప్రభుత్వానికి ఆమె (TRS Chief Kavitha) వార్నింగ్​ ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణులు, సంబంధిత వర్గాలతో చర్చించిత తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కవిత డిమాండ్​ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>