పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండ: శ్రీహరి రావు.

కలం, నిర్మల్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) అన్నారు. మంగళవారం నిర్మల్ (Nirmal) నియోజకవర్గానికి చెందిన 150 మంది లబ్ధిదారులకు రూ.58,34,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీహరిరావు మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఊరటనిస్తోందన్నారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీంరెడ్డి, అబ్దుల్ హాది, డీసీసీ ప్రధాన కార్యదర్శి గాజుల రవికుమార్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>