కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు (Development Funds) మంజూరు అయ్యాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) తెలిపారు. లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్ మండలాల్లో మూడు కీలక అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1.22 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని మంగళవారం వెల్లడించారు.
వడ్యాల్ గ్రామ సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్‌పై గతంలో కూలిపోయిన వంతెన పునర్నిర్మాణానికి రూ.66 లక్షలు, రాచాపూర్ కెనాల్‌పై సూపర్ ప్యాసేజ్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.39.40, అలాగే నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనుల చేపట్టేందుకు రూ.17.20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సాగునీటి అవసరాలకు ఉపశమనం కలగనుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ రమేష్ బాబులకు ఈ సందర్భంగా శ్రీహరిరావు కృతజ్ఞతలు తెలిపారు.

