ఎల్కతుర్తి మార్కెట్ యార్డులో నూతన భవనానికి శంకుస్థాపన

కలం, హనుమకొండ: రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు (Elkathurthy Market Yard) లో రూ.1.02 కోట్లతో నిర్మించనున్న నూతన కార్యాలయ భవనానికి మంగళవారం మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మార్కెట్ యార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్కతుర్తి మార్కెట్‌లో కోతుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు దళారులకు విక్రయించకుండా మార్కెట్ యార్డుల్లో ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. గ్రామాల్లో సబ్ మార్కెట్ యార్డుల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని సర్పంచులకు సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, మార్కెట్ వైస్ చైర్మన్ స్రవంతి, సర్పంచ్ లావణ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>