కలం, వెబ్ డెస్క్ : ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు సంబంధించిన నకిలీ వీడియోల కేసులో హైదరాబాద్ యూత్ కరేజ్ (HYC) అధ్యక్షుడు సల్మాన్ (HYC Salman)ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు సంబంధించిన మార్ఫింగ్, ఫేక్ వీడియోలను సృష్టించి కొందరు వ్యక్తులు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని, డబ్బుల కోసం ఎక్స్‌టార్షన్ చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మీర్జా రెహ్మత్ బేగ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన నార్సింగి పోలీసులు గతంలోనే ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న HYC సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.

