మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: పేదలు, రైతులు, మహిళలు, వృద్ధుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Tudi Megha Reddy) అన్నారు. వనపర్తి నియోజకవర్గానికి ప్రతినెలా సుమారు రూ.11 కోట్ల పింఛను నగదును ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. సోమవారం వనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, డిజిటల్ రేషన్ కార్డులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి పథకాలతో పాటు రైతు రుణమాఫీ, సన్నధాన్యానికి బోనస్, కొత్త రేషన్ కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.

కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. వనపర్తి నియోజకవర్గానికి ఇప్పటికే 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, నిరుపేదలకు సొంత ఇళ్లు కల్పించి గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెల్యే విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవికిరణ్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వాల్య నాయక్, దళిత సర్పంచుల రాష్ట్ర అధ్యక్షుడు రాములు, మాజీ ఎంపీపీలు శంకర్ నాయక్, కిచ్చారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>