19 నుంచి ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ క్యాంపులు: కలెక్టర్

కలం, ఆదిలాబాద్: జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి ‘ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం’ పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం’ అమలుకు సంబంధించిన క్యాంపుల నిర్వహణ, ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం కార్యక్రమం జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమై ఒక నెల రోజుల పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ పథకం పకడ్బందీ అమలుకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని, క్యాంపుల నిర్వహణలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి లేదా వార్డుకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. అలాగే, మూడు లేదా నాలుగు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక ప్రత్యేక అధికారిని పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయడంతో పాటు, మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాల్సి ఉంటుందని అధికారులకు సూచించారు.

దరఖాస్తు ప్రక్రియలో ఫారమ్‌లలో రేషన్ కార్డు డేటా ఆటోమేటిక్‌గా వస్తుందని, ఆ సమాచారం ఉన్నవారి వద్ద కేవలం నామినీ వివరాలు నమోదు చేసి, లబ్ధిదారుల నుంచి సంతకం తీసుకొని ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అయితే, నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో లేదా ఫారమ్‌లో వివరాలు రాని పక్షంలో, భౌతికంగా ఫారమ్‌లను ప్రింట్ తీసుకుని, వాటిపై లబ్ధిదారుల నుంచి సంతకాలు సేకరించాలని ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్డీఓ రవీందర్, జెడ్పీ సీఈఓ రవి, డిపిఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>