రాహుల్‌, ప్రియాంకల‌ ఒత్తిడితోనే ఆత్మ‌క‌థ రాశా: సోనియా గాంధీ

క‌లం, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆత్మ‌క‌థ బిలాంగింగ్: ఏ జ‌ర్నీ ఆఫ్ ల‌వ్ పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఢిల్లీలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గే స‌హా కాంగ్రెస్ అగ్ర‌నేత‌లంతా హాజ‌ర‌య్యారు. త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా త‌ర‌లివ‌చ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఇండియా కూట‌మి నేత‌లు ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్ , ప్రియాంక‌ల ఒత్తిడితోనే ఆత్మ‌థ రాసిన‌ట్లు తెలిపారు. పుస్త‌కాలను ఆవిష్క‌రించి కాంగ్రెస్ నేత‌ల‌కు, అతిథుల‌కు అందించారు.

త‌న కుటుంబం గురించి, ముఖ్యంగా త‌న అత్త, భ‌ర్త‌, కొడుకు, కూతురు గురించి ఎన్నో విష‌యాలు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉన్నాయ‌ని, అందులో చాలా వ‌ర‌కు వాస్త‌వాల‌కు దూరంగా ఉన్నాయ‌ని సోనియా గాంధీ చెప్పారు. వీటిపై త‌న పుస్త‌కంలో పూర్తి వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. తమ జీవితాల చుట్టూ ఎన్నో కల్పిత కథనాలు అల్లుతున్నారని, నిజం కాని విషయాలను ప్రచారం చేస్తున్నారని, త‌మ‌కు బాధ కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నారని సోనియా గాంధీ ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన మనసులోని భావాలను, తన కుటుంబం గురించి తనకు తెలిసిన వాస్తవాలను పుస్తకం ద్వారా పంచుకోవాలని భావించినట్లు తెలిపారు. త‌మ గురించి న‌డుస్తున్న‌ దుష్ప్ర‌చాల‌ను దాటుకొని తన కథ ప్రజలు అర్థం చేసుకునేందుకు ఈ పుస్తకం ఒక అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>