కడ్తాల్ అయ్యప్ప ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు: ఎమ్మెల్యే ఏలేటి

కలం, సోన్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ (Kadthal Ayyappa Temple) అభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూరైనట్లు బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) తెలిపారు. సోమవారం ఆలయాన్ని సందర్శించిన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి, ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఆలయ అభివృద్ధి పనుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించగా, ప్రస్తుతం రూ.39.80 లక్షలు నికరంగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆలయం పక్కన షెడ్డు నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం అదనపు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నో ఏళ్లుగా అయ్యప్ప స్వామి సేవలో నిమగ్నమై, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గురుస్వామి నర్సారెడ్డి సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి చెనిగారపు చిన్నయ్య, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంనాథ్, రమణారెడ్డి, జమాల్, సరిగెల గంగన్న, సాదం అరవింద్, హరీష్ రెడ్డి, జుట్టు దినేష్, కందుల హరీష్, సాత్విక్, జాఫ్రాపూర్ గ్రామ సర్పంచ్ రాజు రెడ్డి, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>