సగరులకు న్యాయం చేయాలి.. కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన దీక్ష

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో అత్యంత వెనుకబాటుకు లోనైన సగరులను బీసీ-డీ నుంచి ఏ లోకి మార్చి న్యాయం చేయాలని మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా సగర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా సగర సంఘం (Sagara Community) అధ్యక్షుడు సాయి ప్రనిల్ చందర్ సగర ఆధ్వర్యంలో వందలాదిమంది సగరులు నిరసన దీక్షకు దిగారు.

సగరులను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చాలని, సగర ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చి పాలకమండలి ఏర్పాటుతో పాటు నిధులను కేటాయించాలని, 59 జీవోను సవరణ చేసి కూలీలుగా కొనసాగుతున్న సగరులు కాంట్రాక్టర్లుగా ఆర్థికంగా ఎదగడానికి రిజర్వేషన్ సంఖ్య పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 95 శాతం సగరులు నిర్మాణ రంగ కార్మికులుగా ఉండటంతో ఆరోగ్య భద్రత కార్డుతో పాటు 50 సంవత్సరాల వయసు పైబడిన సగరులకు పెన్షన్ పథకం అమలు చేయాలని కోరారు. లోక కళ్యాణార్థం ఒంటి కాలుపై కఠోర దీక్ష చేసి గంగను దివి నుంచి భువికి తీసుకువచ్చిన చరిత్రకారుడు సగర భగీరథ మహర్షి విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని ట్యాంక్ బండ్పై ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. దీక్ష అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రణీల్ చందర్, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డన్న సగర, జాతీయ సాల్ట్ మేకర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఉదయ సగర, మాజీ సర్పంచ్ నిర్మలా, మహిళ అధ్యక్షురాలు పద్మావతి, రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యకులు పల్లె చందు, మండల అధ్యక్షులు సత్యం సగర, మధు సగర, నరేందర్ సగర, బాలకృష్ణ, సంతోష్, గోపీనాథ్, శేఖర్, ప్రసాద్, రాములు, శివశంకర్, కృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>