లింగాపూర్ తండాలోనే నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించాలి

కలం, నిర్మల్: సారంగాపూర్ మండలం లింగాపూర్ తండా (Lingapur Thanda) గ్రామానికి మంజూరైన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని (Gram Panchayat Building) లింగాపూర్ తండాలోనే నిర్మించాలని సర్పంచ్ రాథోడ్ ప్రతాప్ (Sarpanch Rathod Pratap) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 సంవత్సరంలో లింగాపూర్ తండా, లింగాపూర్ గ్రామాలను కలిపి నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ఎంపీడీవో అధికారుల తప్పిదం కారణంగా గ్రామపంచాయతీకి సంబంధించిన అధికారిక కార్యక్రమాలను లింగాపూర్ గ్రామం నుంచి నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గత మార్చి నెలలో నిధులు మంజూరయ్యాయని, అయితే అధికారులు మాత్రం లింగాపూర్ తండాలో కాకుండా లింగాపూర్ గ్రామంలో భవనాన్ని నిర్మించాలని సూచిస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీగా ఏర్పాటైన లింగాపూర్ తండాలో కాకుండా అనుబంధ గ్రామమైన లింగాపూర్‌లో భవనాన్ని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, లింగాపూర్ తండాలోనే నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>